ఈ రోజు అమ్మకి హాలిడే
సింకు నిండిన అంట్లు ప్రకటించాయి జాలిడే
చీపురు చిన్నబోయి దుమ్ముకి దాసోహమంటున్నది
ఇంటి వాకిట ముగ్గు ఇంకా తెల్లవారలేదనుకుంది
పాలవాడు, కూరగాయలవాడు చిన్నబోయి తిరిగిపోయారు
మురికి బట్టలు మూల దాక్కొని మూలుగుతున్నాయి
కొళాయి చడి చప్పుడు లేక మూగబోయింది
వంటా వార్పూ లేక వంటిల్లు విలవిలలాడుతుంది
గజ్జెల సవ్వడి లేక గాలి కూడా వెచ్చగా మారింది
గాజుల గలగలలేవని ఫర్నీచరంత పకపక నవ్వింది
నెచ్చెలి పలుకరించాలేదని ప్రతి మొక్క ముడుచుకు పడుకుంది
ఇల్లంతా నిశబ్దం ఆవహించినట్టుంది
అమ్మో అమ్మ హాలిడే భరించలేకుండా ఉంది
By
ఆకృతి
No comments:
Post a Comment