ఎదుట నీవు నిలిచినా క్షణం నను వలిచెను ఈ మౌనం
నీ రాకకై ఎన్నో ఎదురుచూపులు చూసిన ఈ కనులు ముద్దడెను నేలను
ఏదో చెప్పాలని ఈ పాడు మౌనం విప్పాలని చేసే ఆరాటం
వేసెను ఎందుకో మరి నా పెదవులకి జిడ్డు సిగ్గు
ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు....
Showing posts with label Poems - Aakruti. Show all posts
Showing posts with label Poems - Aakruti. Show all posts
Wednesday, April 25, 2012
కోపం వస్తే
అమ్మో వారికి కోపం వస్తే వచ్చే ఆ నిశబ్దం
మాటలు లేక మూగబోయిన నాలుగు గోడల ఆ యుద్ధం
కళ్ళు కలపకుండా దాగుడు మూతల ఆ కొత్త బంధం
తన గొంతున నా పేరు మళ్లీ మళ్లీ వినాలని
చూసే ఆ ఎదురుచూపుల ఎడారి వనం
ఎప్పుడు వస్తుందో, ఎందుకు వస్తుందో ఈ పాడు కోపం
అది ఉన్నంత సేపు నా బతుకొక శాపం.

అలుసు
కట్టిపడేసావు నన్ను ఎరవేసి నీ చిలిపి నవ్వుల గొలుసు
అందుకే ఇచ్చాను ప్రియ నీకే అందమైన నా మనసు
నువ్వే నా ప్రాణమని నీకు తెలుసు
మరి నేనంటే ఎందుకు నీకు అంత అలుసు
అందుకే ఇచ్చాను ప్రియ నీకే అందమైన నా మనసు
నువ్వే నా ప్రాణమని నీకు తెలుసు
మరి నేనంటే ఎందుకు నీకు అంత అలుసు
ఎదురుచూపులు
అద్దం విసుకు పడుతుందేమో మళ్లీ తన వంక చూస్తె
పూవులు నీ నవ్వులు మాకేపుడు చూపిస్తావని అడుగుతున్నాయి
వెలవెల బోయిన ఈ మోము విప్పరుదామని ఎదురు చూస్తుంది
నువ్వు లేవన్న వంక తో చందమామ మబ్బుల చాటున దాగి నవ్వుకుంటుంది
ఎదురు చూపులు చూస్తున్న కళ్ళు నిదురమ్మ వడి చేరుతామని అంటున్నాయి
చల్లటి చిరుగాలి వెక్కిరిస్తూ అటు ఇటు తిరుగుతున్నది
ఎప్పుడు నువ్వోస్తావు అంటూ యద లయ సోద పెడుతుంది
త్వరగా వచ్చి ఈ ఎదురుచూపుల నుండి నన్ను కాపాడు ప్రియ నేస్తమా

Tuesday, April 24, 2012
తెలుగులో అమ్మాయి
అమ్మాయి నుంచి అమ్మ వరకు తెలుగామ్మయిని వివరించాలంటే ఇలా చెప్పొచ్చేమో...
అమ్మాయి అన్న పదానికి పర్యాయ పదాలు గమనిస్తే ఈ చిలిపి కవిత రాయాలనిపించింది
కవ్వించే కళ్ళతో కట్టి పడేసే కన్య
లాలి పాటల లాలన మన లలన
మగవాడి ప్రేమలో గువ్వల ఒడిగేది ఈ మగువ ప్రేమానురాగాల చల్లని ఒడి పంచే ఒమన
అందమే తానై జగమంతా వ్యాపించిన హరివిల్లు ఈ అతివ
మగవాడి తోడు నీడ మహిళ
నవ్వుల తియ్యని పువ్వులు పూయించే పంచదార బొమ్మ ఈ నారి
వంటింటి కోటలో మహారాణి ఈ వనితామని
యద్లోయాల్లో ఊహల పల్లకీలు మోసే అమాయకపు యువతీ
అత్తవారింటి మహాలక్ష్మి ఆడపిల్ల
రోజా సొగసుల రత్నాల తోట మన రమణి
సన్నిధిలో సంతోషాలను పంచె అమృత మూర్తి ఈ సతి
చిరునవ్వుతో పన్నీరు ఒలికించే బంగారు బొమ్మ మన భామిని
పరువాల సెలయేరు ఈ పడతి
పిల్లనగ్రోవి పలికే రాగల పాట మన పడుచు
అందానికి నిర్వచనం అల్లరి తెలుగమ్మాయి
సంపదల కొలువు లక్ష్మీ దేవి ప్రతిరూపం ఈ స్త్రీ
బ్రహ్మ మనకందించిన అమూల్యమైన బహుమతి భామ
జ్ఞాపకాలు
అలలా వచ్చావు
నన్ను అలరించావు
మురిపెంగా నా మనసుని దోచి
జ్ఞాపాకాల ముత్యాలు నా ముందుంచి మరల తిరిగి వెళ్ళిపోయావు
మళ్లీ నీ రాకకై ప్రేమ సాగరతీరాన
ఊహల ఇసుక మేడలు కడుతూ నిరీక్షిస్తున్నాను ప్రియ నేస్తమా
నన్ను అలరించావు
మురిపెంగా నా మనసుని దోచి
జ్ఞాపాకాల ముత్యాలు నా ముందుంచి మరల తిరిగి వెళ్ళిపోయావు
మళ్లీ నీ రాకకై ప్రేమ సాగరతీరాన
ఊహల ఇసుక మేడలు కడుతూ నిరీక్షిస్తున్నాను ప్రియ నేస్తమా
Tuesday, April 10, 2012
అమ్మకి హాలిడే
ఈ రోజు అమ్మకి హాలిడే
సింకు నిండిన అంట్లు ప్రకటించాయి జాలిడే
చీపురు చిన్నబోయి దుమ్ముకి దాసోహమంటున్నది
ఇంటి వాకిట ముగ్గు ఇంకా తెల్లవారలేదనుకుంది
పాలవాడు, కూరగాయలవాడు చిన్నబోయి తిరిగిపోయారు
మురికి బట్టలు మూల దాక్కొని మూలుగుతున్నాయి
కొళాయి చడి చప్పుడు లేక మూగబోయింది
వంటా వార్పూ లేక వంటిల్లు విలవిలలాడుతుంది
గజ్జెల సవ్వడి లేక గాలి కూడా వెచ్చగా మారింది
గాజుల గలగలలేవని ఫర్నీచరంత పకపక నవ్వింది
నెచ్చెలి పలుకరించాలేదని ప్రతి మొక్క ముడుచుకు పడుకుంది
ఇల్లంతా నిశబ్దం ఆవహించినట్టుంది
అమ్మో అమ్మ హాలిడే భరించలేకుండా ఉంది
By
ఆకృతి
Monday, April 9, 2012
నీ మౌనం
నీ మౌనం
నన్ను నిలువునా తోలుస్తున్నది
బాధ లోతు ఎంతో నా మది కోలుస్తున్నది
కోపంగా నువ్వు, భారంగా నేను
ఈ దూరం పెంచేస్తున్నది
నన్ను నిలువునా తోలుస్తున్నది
బాధ లోతు ఎంతో నా మది కోలుస్తున్నది
కోపంగా నువ్వు, భారంగా నేను
ఈ దూరం పెంచేస్తున్నది
ఓ ప్రేమ ఎక్కడ దాక్కున్నావు
ఓ ప్రేమ ఎక్కడ దాక్కున్నావు
అనుకోని అతిథిలా వచ్చావు
నచ్చనన్నావు వరించావు
నన్ను నా నుంచి విడదీసి
నీలో కలుపుకున్నావు
చుక్కలు తేన్చుకోస్తానని నాతో చెప్పి
అంతస్తుల లెక్కల్లో మునిగిపోతున్నావు
కలిసి బతుకుదామన్నావు
కలల్లో మాత్రమె వచ్చి వెళుతున్నావు
ఒంటరి నా ప్రయాణానికి అప్పుడు
జతగా నువ్వు కలిసావు
ఇప్పుడు నన్నెందుకు వదిలి
వడివడిగా పరిగెత్తుతున్నావు
అనుకోని అతిథిలా వచ్చావు
నచ్చనన్నావు వరించావు
నన్ను నా నుంచి విడదీసి
నీలో కలుపుకున్నావు
చుక్కలు తేన్చుకోస్తానని నాతో చెప్పి
అంతస్తుల లెక్కల్లో మునిగిపోతున్నావు
కలిసి బతుకుదామన్నావు
కలల్లో మాత్రమె వచ్చి వెళుతున్నావు
ఒంటరి నా ప్రయాణానికి అప్పుడు
జతగా నువ్వు కలిసావు
ఇప్పుడు నన్నెందుకు వదిలి
వడివడిగా పరిగెత్తుతున్నావు
అమ్మ ప్రేమ - Mother's love
అమ్మ మీద ఒక కవిత రాద్దామని మొదలెట్టాను
కాని ఏమని చెప్పను
చలి మొదలయ్యిందని చందమామ రోజు రాకుండా ఉన్నాడ
అమ్మ ప్రేమ కూడా అంతే
కాలం తో సంబందం లేదు.
ఎవ్వరు తనని తాకడం లేదు అని
అడవిలో పూలు పూయకుండా ఉన్నాయా
అమ్మ ప్రేమ కూడా అంతే
తనని ఎవ్వరూ పట్టించుకోకున్నా అందరినీ ఆదరిస్తుంది
మబ్బులు కమ్మినాయని ఆకాశం
మనకు నీడ నివ్వడం వదిలేసింద
అమ్మ ప్రేమ కూడా అంతే
తను కష్టాల కడలిలో తడుస్తూ
మనకి సుఖాల గొడుగు పడుతుంది
మనం కాసేపు ఆగామని
కాలం మనతో ఆగుతుందా
అమ్మ ప్రేమ కూడా అంతే
ఏదేమైనా తాను ఆగకుండా కాలం తో పోరాడుతుంది
తనని ఎవ్వరు పట్టించుకోవటం లేదని
అడవిలో వెన్నెల కాయకుండా ఉంటుందా
అమ్మ ప్రేమ కూడా అంతే
మనము తనని చూడకున్నా
తన దృష్టంతా మనమీదనే లగ్నం చేస్తుంది.

అమ్మా నీకు జోహార్లు
అమ్మా నీకు జోహార్లు
ఏమిచ్చి తీర్చగలను నీ ఋణం
నువ్విచ్చిన ఊపిరి వేల కట్టలేనిది
నువ్వు నేర్పిన పలుకుల మూటలు ఎత్తలేనివి
అ ఆ లతో నువ్వు మొదలుపెట్టిన నా చదువు
ఇప్పుడు నా జీవనానికి దారి చూపిస్తున్నాయి
నువ్వు నాకు నేర్పిన నీతి పాటాలు
నా బతుకు బండిని విజయవంతంగా లాగుతున్నాయి
నువ్వు నేర్పిన వంటలు
నా ఇంట రోజు నిన్ను మెచ్చుకుంటున్నాయి
నీ ప్రేమ, కోపం, ముద్దు, మురిపం అన్నీకలిపి
నన్ను నీ ప్రతిరూపంగా తాయారు చేసాయి
నీ బతుకంతా నాకు ధారపోసి పెంచావు
నీ ప్రేమంతా కలిపి నన్ను మనిషిని చేసావు
అమ్మా నీకు సదా జోహార్లు

Sunday, April 8, 2012
ప్రేమయ్యిందో ఏమో
ప్రేమయ్యిందో ఏమో కాని
కొత్తగా పుట్టిన నా మనోభావాలకు
బాటలు వేస్తె నీ దరి చేరి నిలుస్తున్నాయి
అక్షరాలతో వాటిని కట్టిపడేయాలనుకుంటే
అవి నీకే అంకితమయ్యామంటున్నాయి
ఏమిటో ఈ ప్రేమ క్షణమైనా నన్ను నా
చెంత చేరనివ్వట్లేదు
ఎప్పుడు నీ ధ్యాసే
అందుకే అనుకుంటున్నాను ప్రేమయ్యిందో ఏమో అని

ఎప్పుడు తెలుసుకుంటావు నేస్తమా
ఎప్పుడు తెలుసుకుంటావు నేస్తమా
గడిచే ప్రతి క్షణం మళ్ళీ రాదు అని
నీ నిరీక్షణలో నే జారవిడుచుకున్న విలువైన ఆ కాలం
నేను రమ్మన్నానన్ను తిరిగి చూడదని
నువ్వు ఎప్పుడూ బిజీనే
నువ్వు వదిలి వెళ్ళిన నేను ఎప్పుడూ గజిబిజీనే
నువ్వక్కడ ప్రతి రూపాయి కష్టపడి సంపాదిస్తున్నాను అని అనుకుంటున్నావు
నేనిక్కడ కదిలే ప్రతి క్షణం నిన్ను వదిలి మదనపడుతున్నాను
రాత్రింబవళ్ళు నువ్వు పడే నీ కష్టానికి సక్సెస్ అని పేరు పెట్టుకుని మురిసిపోతున్నావు
మరి నన్ను చేరదీసిన ఈ వంటరితనానికి ఏమిచ్చి ఋణం తీర్చుకోను నీ జ్ఞాపకాలు తప్ప
నా కోసమే కష్టపడుతున్నాను అని అంటావు కదా మరి
నీతో గడపాలనే నా ఇష్టాన్ని ఎక్కడ జారవిడుచుకోవలో కూడా నువ్వే చెప్పు నేస్తమా
నీవు చిందించిన చెమటను నోట్లగా నాకు కానుక అందించి మురుస్తావు
నా మనసు వలికించిన ఈ కన్నీళ్లను ఎలా నీకు దాచివ్వగాలను
నువ్వు కొని తెచ్చిన నగలు అన్ని నువ్వు లేవని దరి చేరనివ్వటం లేదు నన్ను
పట్టు పితంబారాలు నాపై అలిగి బీరవలో తలదాచుకుంటున్నాయి
కొండంత సంపాదనతో నిండి ఉండే భవిష్యతు నాకు అందివ్వాలని నువ్వు ఆరాట పడుతున్నవేమో కాని
నీవు లేని గతం గడిపిన నేను ఏమివ్వగలనునీకు నన్ను ఆవహిస్తున్న ఈ నిర్లిప్తత తప్ప

నా బంగారం - Bangaram
ఎలా చెప్పను నా బంగారు తల్లి
నువ్వు నా జీవితం లోకి వచ్చింది మొదలు
మొదలైన నా అమ్మతనపు అనుభవాలు
నా కడుపులో కదులుతున్నప్పుడు
నేను అనుభవించిన ఆ మధుర క్షణాలు
మా ప్రేమకు రూపమైన నువ్వు
నెలలు నిండి నా చేతుల చేరిన ఆ క్షణము
పులకించిన నా అణువణువు అందించిన ఆనంద భాష్పాల బహుమతులు
అమ్మ అని నువ్వు మొదటిసారి పలికిన క్షణం
మరిచిపోయా నాకు మా అమ్మ నేర్పించిన ఓనమాలు
నీ చిన్ని చిన్ని అడుగులు నడిపించాయి నన్ను
ఎన్నడూ నేను ఎరుగని క్రొత్త దారులకు
నీ చేతులు నన్ను అల్లుకున్నప్పుడల్లా
మ్రోగాయి నా హృదయం లో వేవేల జేఘంటలు
అల్లి బిల్లి పలుకులు నువ్వు పలికే ప్రతిసారి
అవి కోటి వీణలై మ్రోగించాయి కొత్త కొత్త రాగాలు
నీ చిరునవ్వు నాకు చంద్రుని చల్లదనం అందిస్తే
నీ అల్లరి నాకు కితకితలు పెట్టింది
నువ్వు బుంగమూతి ముడిచి నప్పుడల్లా
నా ప్రపంచాన్నంత నీకు అందివాలనిపిస్తుంది
ఎదుగుతున్న నిను చూసి ఎద బరువనిపిస్తుంది
ఏ అయ్యా నీ కోసం తన చేతులు చాచి ఎదురుచూస్తున్నాడోనని
ఈ అమ్మను వదిలి వెళ్ళే ఆ క్షణాన ఎలా ఆపగలను
ఈ పగలబోయే గుండెను
తలచుకుంటేనే భయమేస్తుంది.......

Subscribe to:
Posts (Atom)