తెలుగు సినిమా ట్రివియా
తిరుగులేని అత్తగారు సూర్యకాంతం
మన తెలుగు సినిమాలలో అత్తగారంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సూర్యకాంతం గారు. గయ్యళి అత్తగారి పాత్రలకు సూర్యకాంతం గారు పెట్టింది పేరు. కఠినంగా ఉండే అత్తగార్లను సూర్యకాంతం గారితో పొలుస్తారంటేనే అర్ధమవుతుంది సూర్యకాంతం గారు తన గయ్యాలి అత్తగారి పాత్రలతో మనందరిని ఎంతగా మెప్పించారో. సూర్యకాంతం గారు కాకినాడకు దగ్గరలొ ఉన్న వెంకటక్రష్ణాపురంలో అక్టోబర్ 28 న జన్మించారు. తన తల్లితండ్రులకు తను 14వ సంతానం. తన ఆరో ఏట నుంచే నృత్యం నేర్చుకోవడం ప్రారంభించారు. గయ్యాళి పాత్రలు వేసినప్పటికి సూర్యకాంతం గారు నిజ జీవితంలొ చాల మంచివారు. ఉదాహరణకు ఒక సారి హిందీ సినిమాలో తనకు హీరొయిన్ చాన్స్ వచ్చిందంట కాని ఆ పాత్ర మొదట వేరొకరికి ఇచ్చి వారిని కాదని ఆ తరువాత తనకిచ్చారని తెలిసిన సూర్యకాంతంగారు ఆ పాత్రను వదిలేసుకున్నారు. వేరొకరు బాద పడుతుంటే తను సంతొషంగా ఉండలేనని ఆ పని చేసారంట, అంత మంచి మనసు కలవారావిడ . సూర్యకాంతం గారు ఎందరికొ సాయం చేసి ఆపదల్లొ ఆదుకున్నారు. తనతో పాటు ఎన్నో సినిమాల్లో నటించిన రేలంగి గారు స్క్రిప్ట్ లో లేని డై లాగులు సంధర్బొచితంగా చెబుతు ఉండే వారంట దాంతొ తోటి ఆర్టిస్టులు తికమక పడేవారు కానీ సూర్యకాంతం గారు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా రేలంగి గారికి ధీటుగా స్పందిస్తూ ఆ సన్నివేశాన్ని రక్తి కట్టించేవారంట. సూర్యకాంతం గారు తరచూ తన ఇంట్లో వడలు, పులిహోరా చేసుకొనివచ్చి అందరికి ఆప్యాయంగా వడ్డించేవారని తనతో నటించిన రమాప్రభ గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.
No comments:
Post a Comment