ఎలా చెప్పను నా బంగారు తల్లి
నువ్వు నా జీవితం లోకి వచ్చింది మొదలు
మొదలైన నా అమ్మతనపు అనుభవాలు
నా కడుపులో కదులుతున్నప్పుడు
నేను అనుభవించిన ఆ మధుర క్షణాలు
మా ప్రేమకు రూపమైన నువ్వు
నెలలు నిండి నా చేతుల చేరిన ఆ క్షణము
పులకించిన నా అణువణువు అందించిన ఆనంద భాష్పాల బహుమతులు
అమ్మ అని నువ్వు మొదటిసారి పలికిన క్షణం
మరిచిపోయా నాకు మా అమ్మ నేర్పించిన ఓనమాలు
నీ చిన్ని చిన్ని అడుగులు నడిపించాయి నన్ను
ఎన్నడూ నేను ఎరుగని క్రొత్త దారులకు
నీ చేతులు నన్ను అల్లుకున్నప్పుడల్లా
మ్రోగాయి నా హృదయం లో వేవేల జేఘంటలు
అల్లి బిల్లి పలుకులు నువ్వు పలికే ప్రతిసారి
అవి కోటి వీణలై మ్రోగించాయి కొత్త కొత్త రాగాలు
నీ చిరునవ్వు నాకు చంద్రుని చల్లదనం అందిస్తే
నీ అల్లరి నాకు కితకితలు పెట్టింది
నువ్వు బుంగమూతి ముడిచి నప్పుడల్లా
నా ప్రపంచాన్నంత నీకు అందివాలనిపిస్తుంది
ఎదుగుతున్న నిను చూసి ఎద బరువనిపిస్తుంది
ఏ అయ్యా నీ కోసం తన చేతులు చాచి ఎదురుచూస్తున్నాడోనని
ఈ అమ్మను వదిలి వెళ్ళే ఆ క్షణాన ఎలా ఆపగలను
ఈ పగలబోయే గుండెను
తలచుకుంటేనే భయమేస్తుంది.......
By
ఆకృతి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment