ఎప్పుడు తెలుసుకుంటావు నేస్తమా
గడిచే ప్రతి క్షణం మళ్ళీ రాదు అని
నీ నిరీక్షణలో నే జారవిడుచుకున్న విలువైన ఆ కాలం
నేను రమ్మన్నానన్ను తిరిగి చూడదని
నువ్వు ఎప్పుడూ బిజీనే
నువ్వు వదిలి వెళ్ళిన నేను ఎప్పుడూ గజిబిజీనే
నువ్వక్కడ ప్రతి రూపాయి కష్టపడి సంపాదిస్తున్నాను అని అనుకుంటున్నావు
నేనిక్కడ కదిలే ప్రతి క్షణం నిన్ను వదిలి మదనపడుతున్నాను
రాత్రింబవళ్ళు నువ్వు పడే నీ కష్టానికి సక్సెస్ అని పేరు పెట్టుకుని మురిసిపోతున్నావు
మరి నన్ను చేరదీసిన ఈ వంటరితనానికి ఏమిచ్చి ఋణం తీర్చుకోను నీ జ్ఞాపకాలు తప్ప
నా కోసమే కష్టపడుతున్నాను అని అంటావు కదా మరి
నీతో గడపాలనే నా ఇష్టాన్ని ఎక్కడ జారవిడుచుకోవలో కూడా నువ్వే చెప్పు నేస్తమా
నీవు చిందించిన చెమటను నోట్లగా నాకు కానుక అందించి మురుస్తావు
నా మనసు వలికించిన ఈ కన్నీళ్లను ఎలా నీకు దాచివ్వగాలను
నువ్వు కొని తెచ్చిన నగలు అన్ని నువ్వు లేవని దరి చేరనివ్వటం లేదు నన్ను
పట్టు పితంబారాలు నాపై అలిగి బీరవలో తలదాచుకుంటున్నాయి
కొండంత సంపాదనతో నిండి ఉండే భవిష్యతు నాకు అందివ్వాలని నువ్వు ఆరాట పడుతున్నవేమో కాని
నీవు లేని గతం గడిపిన నేను ఏమివ్వగలనునీకు నన్ను ఆవహిస్తున్న ఈ నిర్లిప్తత తప్ప
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment