అమ్మా నీకు జోహార్లు
ఏమిచ్చి తీర్చగలను నీ ఋణం
నువ్విచ్చిన ఊపిరి వేల కట్టలేనిది
నువ్వు నేర్పిన పలుకుల మూటలు ఎత్తలేనివి
అ ఆ లతో నువ్వు మొదలుపెట్టిన నా చదువు
ఇప్పుడు నా జీవనానికి దారి చూపిస్తున్నాయి
నువ్వు నాకు నేర్పిన నీతి పాటాలు
నా బతుకు బండిని విజయవంతంగా లాగుతున్నాయి
నువ్వు నేర్పిన వంటలు
నా ఇంట రోజు నిన్ను మెచ్చుకుంటున్నాయి
నీ ప్రేమ, కోపం, ముద్దు, మురిపం అన్నీకలిపి
నన్ను నీ ప్రతిరూపంగా తాయారు చేసాయి
నీ బతుకంతా నాకు ధారపోసి పెంచావు
నీ ప్రేమంతా కలిపి నన్ను మనిషిని చేసావు
అమ్మా నీకు సదా జోహార్లు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment