అమ్మ మీద ఒక కవిత రాద్దామని మొదలెట్టాను
కాని ఏమని చెప్పను
చలి మొదలయ్యిందని చందమామ రోజు రాకుండా ఉన్నాడ
అమ్మ ప్రేమ కూడా అంతే
కాలం తో సంబందం లేదు.
ఎవ్వరు తనని తాకడం లేదు అని
అడవిలో పూలు పూయకుండా ఉన్నాయా
అమ్మ ప్రేమ కూడా అంతే
తనని ఎవ్వరూ పట్టించుకోకున్నా అందరినీ ఆదరిస్తుంది
మబ్బులు కమ్మినాయని ఆకాశం
మనకు నీడ నివ్వడం వదిలేసింద
అమ్మ ప్రేమ కూడా అంతే
తను కష్టాల కడలిలో తడుస్తూ
మనకి సుఖాల గొడుగు పడుతుంది
మనం కాసేపు ఆగామని
కాలం మనతో ఆగుతుందా
అమ్మ ప్రేమ కూడా అంతే
ఏదేమైనా తాను ఆగకుండా కాలం తో పోరాడుతుంది
తనని ఎవ్వరు పట్టించుకోవటం లేదని
అడవిలో వెన్నెల కాయకుండా ఉంటుందా
అమ్మ ప్రేమ కూడా అంతే
మనము తనని చూడకున్నా
తన దృష్టంతా మనమీదనే లగ్నం చేస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment