అద్దం విసుకు పడుతుందేమో మళ్లీ తన వంక చూస్తె
పూవులు నీ నవ్వులు మాకేపుడు చూపిస్తావని అడుగుతున్నాయి
వెలవెల బోయిన ఈ మోము విప్పరుదామని ఎదురు చూస్తుంది
నువ్వు లేవన్న వంక తో చందమామ మబ్బుల చాటున దాగి నవ్వుకుంటుంది
ఎదురు చూపులు చూస్తున్న కళ్ళు నిదురమ్మ వడి చేరుతామని అంటున్నాయి
చల్లటి చిరుగాలి వెక్కిరిస్తూ అటు ఇటు తిరుగుతున్నది
ఎప్పుడు నువ్వోస్తావు అంటూ యద లయ సోద పెడుతుంది
త్వరగా వచ్చి ఈ ఎదురుచూపుల నుండి నన్ను కాపాడు ప్రియ నేస్తమా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment