billboard

Bhakti

Tuesday, April 24, 2012

తెలుగులో అమ్మాయి

అమ్మాయి నుంచి అమ్మ వరకు తెలుగామ్మయిని వివరించాలంటే ఇలా చెప్పొచ్చేమో...
అమ్మాయి అన్న పదానికి పర్యాయ పదాలు గమనిస్తే ఈ చిలిపి కవిత రాయాలనిపించింది


కవ్వించే కళ్ళతో కట్టి పడేసే కన్య
లాలి పాటల లాలన మన లలన
మగవాడి ప్రేమలో గువ్వల ఒడిగేది ఈ మగువ

ప్రేమానురాగాల చల్లని ఒడి పంచే ఒమన
అందమే తానై జగమంతా వ్యాపించిన హరివిల్లు అతివ
మగవాడి తోడు నీడ మహిళ
నవ్వుల తియ్యని పువ్వులు పూయించే పంచదార బొమ్మ ఈ నారి
వంటింటి కోటలో మహారాణి ఈ వనితామని
యద్లోయాల్లో ఊహల పల్లకీలు మోసే అమాయకపు యువతీ
అత్తవారింటి మహాలక్ష్మి ఆడపిల్ల
రోజా సొగసుల రత్నాల తోట మన రమణి
సన్నిధిలో సంతోషాలను పంచె అమృత మూర్తి ఈ సతి
చిరునవ్వుతో పన్నీరు ఒలికించే బంగారు బొమ్మ మన భామిని
పరువాల సెలయేరు ఈ పడతి
పిల్లనగ్రోవి పలికే రాగల పాట మన పడుచు
అందానికి నిర్వచనం అల్లరి తెలుగమ్మాయి
సంపదల కొలువు లక్ష్మీ దేవి ప్రతిరూపం ఈ స్త్రీ
బ్రహ్మ మనకందించిన అమూల్యమైన బహుమతి భామ

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

SMALL BUSINESS IDEAS FOR WOMEN