ఓ ప్రేమ ఎక్కడ దాక్కున్నావు
అనుకోని అతిథిలా వచ్చావు
నచ్చనన్నావు వరించావు
నన్ను నా నుంచి విడదీసి
నీలో కలుపుకున్నావు
చుక్కలు తేన్చుకోస్తానని నాతో చెప్పి
అంతస్తుల లెక్కల్లో మునిగిపోతున్నావు
కలిసి బతుకుదామన్నావు
కలల్లో మాత్రమె వచ్చి వెళుతున్నావు
ఒంటరి నా ప్రయాణానికి అప్పుడు
జతగా నువ్వు కలిసావు
ఇప్పుడు నన్నెందుకు వదిలి
వడివడిగా పరిగెత్తుతున్నావు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment