నాకు నచ్చిన టాప్ టెన్ సాంగ్స్ అఫ్ మహానటి సావిత్రి
(Top 10 songs of Savitri)
సావిత్రి గారంటే ఇష్టం లేని వారంటూ ఉండరు, అందం అభినయం రెండు కలబోసిన ఆణిముత్యం సావిత్రి. అలాంటి మహానటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సావిత్రి గారు నటించిన చిత్రాలలోంచి నాకు నచ్చిన 10 పాటలు సెలెక్ట్ చేసుకోవటం కష్టమే కాని కొద్ది సేపు ఆ మధుర గీతాలను గుర్తుకు తెచ్చుకోవడానికె ఈ ప్రయత్నం .
మాయాబజార్ చిత్రంలోని ఈ పాట చిన్న పెద్దా అందరిని అలరిస్తుంది. సావిత్రి ఘటోత్కచుడి లా స్టెప్స్ వేయడం అంతలోనే సర్దుకొని ఆడపిల్లలా నర్తించడం సావిత్రి గారు చాలా బాగా చెసారు.
నర్తనశాల చిత్రంలోని జనని శివకామిని పాట. ఈ పాట మనం ఈనాటికి మంగళహారతులలొ పాడుకుంటాము .
డాక్టర్ చక్రవర్తి చిత్రం లోని "'నీవు లేక వీణ" పాట.
మాంగళ్యబలం చిత్రంలోని ఆకాశవీధిలో అందాల జాబిలీ పాట.
దొంగరాముడు లోని "చిగురాకులలో చిలకమ్మా"
దేవత చిత్రలోని ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి పాట మహిళలకు అంకితం .
మిస్సమ్మ చిత్రంలోని ఏమిటో ఈ మాయా పాట
మాతృ దేవత చిత్రంలోని "మనసే కోవెలగా" పాట
మంచిమనసులు సినిమాలోని "ఏమండోయ్ శ్రీవారు " పాటలో కొంటె పిల్లగా సావిత్రి గారి నటన అద్భుతం .
భలేరాముడు చిత్రంలోని "ఓహో మేఘమాల " పాట
No comments:
Post a Comment