MY FAVORITE MOVIES
ENGLISH VINGLISH - ఇంగ్లీష్ వింగ్లిశ్
శ్రీదేవి 15 సంవత్సరాల తరువాత తన నటనా కౌశల్యాన్ని మరో సారి నిరూపించుకున్న చిత్రం "ఇంగ్లీష్ వింగ్లిష్ (ENGLISH VINGLISH)" . ఈ చిత్రం ద్వారా శ్రీదేవి తమిళ చిత్రాలలో 26 సంవత్సరాల తరువాత, తెలుగు చిత్రాలలో 18 సంవత్సరాల తరువాత మరియు హిందీ చిత్రాలలో 15 సంవత్సరాల తరువాత పునఃప్రవేశం చేసింది .
ఈ చిత్రం గౌరీ షిండే కి మొదటి చిత్రం. ఈ చిత్ర కథని తనే రాసి దర్శకత్వం వహించారు గౌరీ షిండే .
ఈ చిత్రంలో శ్రీదేవి పేరు "శశి " . ఈ చిత్రం యొక్క ఇతివృత్తం ఒక మధ్య తరగతి గృహిణి మనోభావాలకు అద్దం పడుతుంది . శశి ఇంట్లొ లడ్డులు తయారు చేసి సప్లయ్ చేస్తూ తన సొంత వ్యాపారం చూసుకుంటూ ఉంటుంది . కాని తనకు ఇంగ్లీష్ నైపుణ్యం లేకపోవడం వలన భర్త మరియు కుమార్తె తనను గేలి చేయడం శశిలో ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న పట్టుదలకు శ్రీకారం చుడుతుంది . ఆ క్రమంలో తను అమెరికాలో ఉన్న తన అక్క కుమార్తె వివాహానికి వెళ్ళవలసి రావడం అక్కడ ఇంగ్లీష్ నేర్చుకుని ఎలా తనను తానూ ఎలా నిరుపించుకుందో ఈ చిత్రంలో చాలా అందంగా చూపించారు దర్శకురాలు గౌరి .
ఈ చిత్రంలో శ్రీదేవి పోషించిన పాత్రని గౌరి షిండే తల్లి గారి ప్రేరణతో తయారు చేసారు. గౌరీ షిండే తల్లి పూనే లో ఇంటి వద్ద ఒక ఊరగాయ వ్యాపారం నడిపించేవారు. తను మరాఠీ మాట్లాడే వారు కాని తనకు ఇంగ్లిష్ వచ్చేది కాదు. షిండే కి ఈ విషయం చిన్నతంగా ఉండేది . తన ఈ వైఖరిని ఇతివృత్తంగా చేసుకొని కథ రాసుకున్నారు అంతే కాక తనే స్వయంగా దర్శకత్వం వహించి తన కథకు అందమైన రూపం చేకూర్చారు గౌరి . ఒక ఇంటర్వ్యూలో, గౌరి షిండే "నా తల్లికి క్షమాపణ చెప్పటానికే ఈ చిత్రం తయారు చేసాను"' అని చెప్పడం విశేషం .
ఈ చిత్రంలో నాకు నచ్చిన సన్నివేశాలు
- తన కుమార్తెతో కలిసి స్కూల్ లో ప్రిన్సిపాల్ ని కలిసే సన్నివేశం.
- ప్లేన్ లో ఎయిర్ హోస్టెస్ తో జరిగే సన్నివేశంలో శ్రీదేవి హావభావాలు.
- శ్రీదేవి "entrepreneur" అనే పదాన్ని నేర్చుకునే సన్నివేశం
- ముఖ్యంగా చిత్రంలోని క్లైమాక్స్ , శ్రీదేవి స్పీచ్ .
మీకు కూడా గుర్తుండి పోయిన చిత్రం ఏదన్నా ఉంటే చిన్న వ్యాసం లా రాసి మాకు పంపండి . ఇక్కడ ప్రచురిస్తాము. ఈ ఆర్టికల్ పై మీ కామెంట్స్ కూడా తప్పకుండా రాయగలరు.
- ఆకృతి
- ఆకృతి
No comments:
Post a Comment