billboard

Bhakti

Showing posts with label My Favorite Movie. Show all posts
Showing posts with label My Favorite Movie. Show all posts

Saturday, September 26, 2015

MITR, MY FRIEND - మిత్ర్ మై ఫ్రెండ్

MY FAVORITE MOVIES

Mitr, My Friend


మిత్ర్ మై ఫ్రెండ్ (Mitr, My Friend) చిత్రం 2002 లో విడుదలైంది . ఈ చిత్రానికి  ప్రముఖ నటి రేవతి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారా రేవతి నటనలో మాత్రమే కాక దర్శకత్వం లోను తన ప్రతిభను కనబరచారు . ఇంకో గమనించ దగ్గ విషయం ఏమిటంటే ఈ చిత్రానికి సహకరించిన సిబ్బంది అంతా  మహిళాలే.

ఈ చిత్రంలోని ముఖ్య పాత్రని శోభన నటించి తన నటనతో మరోసారి అందరిని మెప్పించగలిగారు .  ఒక చిన్న పట్టణం లోంచి భర్తతో పాటు అమెరికా వచ్చిన అమ్మాయి జీవితంలో జరిగే పరిణామాలు ఈ చిత్రంలో చూపించారు .

లక్ష్మి (శోభన) చిదంబరంకు చెందినా అమ్మాయి తనకి పృథ్వీ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పెళ్లి జరుగుతుంది . పెళ్లి తరువాత ఆ జంట అమెరికా వచ్చి స్థిరపడతారు. కొంత కాలానికి వారికి ఒక పాప పుడుతుంది . ఆ పాపకు దివ్య అని నామకరణం చేస్తారు . అలా 17 సంవత్సరాల తరువాత దివ్య పేరిగి పెద్దదై కళాశాల కు వెళ్తుంది . భర్త కూడా వ్యాపారం లో బిజీ గా ఉంటూ లక్ష్మితో ఎక్కువ సమయం గడపలేక పొతాడు . అలా వారిద్దరి మద్య దూరం పెరుగుతూ ఉంటుంది . లక్ష్మి వంటరితనముతో బాధ పడుతూ కాలం వెళ్ళదీస్తూ ఉంటుంది . 

యుక్తవయసుకు వచ్చిన దివ్య కి ఫ్రెండ్స్, పార్టీలు మొదలవుతాయి. దివ్య వైఖరిలో వచ్చిన మార్పులను గమనిస్తున్న లక్ష్మికి దివ్య చెడు స్నేహాలు నచ్చావు తనని వారించడంతో దానితో ఇద్దరి మధ్య సమస్యలు తలెత్తుతాయి . ప్రిథ్వి మాత్రం వీటన్నింటిని గమనించినా కూడా ఎక్కువగా పట్టించుకోకుండా కూతురుకి మద్దతుగా ఉంటాడు .  


ఒక రోజు దివ్య ఇంటి బయట తన బాయ్ ఫ్రెండ్ తో సన్నిహితంగా ఉండటం చూసిన లక్ష్మి జోస్యం చేసుకోవడంతో అలిగిన దివ్య, ఇంట్లోంచి వెళ్ళిపోయి స్నేహితుల దగ్గర ఉండటం మొదలు పెడుతుంది .


వంటరితనం మరింత పెరిగిన లక్ష్మి కి ఇంటర్నెట్లో ఒక స్నేహితుడు పరిచయమవుతాడు . ఇద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా, మారు పేర్లతో ముచ్చటించుకోవటం మొదలు పెడతారు. క్రమంగా లక్ష్మి అతనితో తన ఆలోచనలు, భావాలు పంచుకోవటం మొదలు పెదుతుంది . అతని ప్రోత్సాహం వళ్ళ లక్ష్మి తన ఆసక్తులు అన్వేషించి వాటి వైపు మనసు మళ్ళించి కాలం గడపటం మొదలు పెడుతుంది . 


ఇంతలో ప్రిథ్వి దివ్యను మిస్ అవటం మరియు లక్ష్మిలో మార్పు గమనిస్తాడు. ఒకరోజు దివ్య కి బాయ్ ఫ్రెండ్ వలన దెబ్బలు తగిలాయని తెలిసిన లక్ష్మి దివ్య ని కలుస్తుంది. దివ్య కూడా తన తప్పు తెలుసుకొని తల్లి వెంట ఇంటికి తిరిగి వస్తుంది . లక్ష్మి దివ్యాల మధ్య తలెత్తిన మనసపర్థాలు తొలగుతాయి . 


ఇంతలో దివ్యకి తన తల్లి ఇంటర్నెట్ ఫ్రెండ్ "'మిత్ర్ " గురించి తెలిసి అతనిని కలవమని తల్లిని ప్రొత్సాహిస్తుంది . లక్ష్మి, మరియు దివ్య "మిత్ర్ " ని కలవవలసిన స్థలంకి వెళ్లేసరికి కథ ఊహించని మలుపు తిరుగుతుంది . ఇంతకాలం తనతో స్నేహం చేసిన ఇంటర్నెట్ మిత్రుడు వేరెవరో కాదు తన భర్త అని తెలిసిన లక్ష్మి షాక్ అవుతుంది . అలాగే ప్రిథ్వి కూడా లక్ష్మిని చూసి ఆశ్చర్యపొతాడు. తను లక్ష్మిని నిర్లక్ష్యం చేయటం వలనే తను తన మనోభావాలను ఇతరులతో పంచుకోవలసి వచ్చిందని తెలిసి ఏంటో బాధపడి తన తప్పు తెలుసుకోవడంతో చిత్రం ముగుస్తుంది . 



  1. ఈ చిత్రం ద్వారా రేవతి అమెరికాలో ఇంట్లోనే ఉండె ఒక గృహిణి ఎలా కాలం వేళ్ళదీస్తుందో శోభన దినచర్యలో చక్కగా చూపించారు . 
  2. ఇంకా చెప్పుకోదగిన విషయాలు ఈ చిత్రంలో ఏమిటంటే బయట దేశంలో పెరుగుతూ అక్కడి సంస్కృతికి, మరియు చెడు స్నేహాల వలన తప్పు దారి పడుతున్న కూతురిని చూస్తూ ఒక తల్లి పడే బాధ. అలాగే భర్త తనకి తగిన సమయం కేటాయించకుండా ఉన్నప్పుడు ఆ భార్య మనో వేదన, ఒంటరి తనం ఈ చిత్రం లో రేవతి చక్కగా చూపించారు .
మీకు కూడా గుర్తుండి పోయిన చిత్రం ఏదన్నా ఉంటే చిన్న వ్యాసం లా రాసి మాకు పంపండి . ఇక్కడ ప్రచురిస్తాము. ఈ ఆర్టికల్ పై మీ కామెంట్స్ కూడా తప్పకుండా రాయగలరు. 


- ఆకృతి 

Wednesday, September 23, 2015

సౌందర్య నటించిన అరుంధతి (1999)

MY FAVORITE MOVIES

సౌందర్య నటించిన అరుంధతి (1999)




అరుంధతి అనగానే ఇంతకూ ముందు మనకు వివాహాలలో చూపించే ఒక నక్షత్రం గుర్తుకు  వచ్చేది . కాని ఈ మధ్యకాలంలో మాత్రం అరుంధతి అనగానే అనుష్క లేదా బొమ్మాలి అన్న పేర్లు గుర్తుకు వస్తాయి  కాని 1999 లో కూడా ఒక చిత్రం ఈ పేరుతొ వచ్చింది అందులో ముఖ్య పాత్ర సౌందర్య పోషించింది . "అందాల సౌందర్య ....హలో హలో అరుంధతి "అంటూ ఒక పాట కూడా ఉంది .

ఈ చిత్రానికి  క్రాంతి కుమార్ గారు దర్శకత్వం వహించారు . ఇందులో మిగతా పాత్రలు రామ్ కుమార్, మీఘన, శ్రీ విద్య , రాధిక తదితరులు పోషించారు . ఇందులో సౌందర్య నటన చాలా బావుంటుంది . 

అక్కినేని నాగేశ్వర్ రావు మరియు జయసుధ నటించిన ఆత్మ బంధువులు

MY FAVORITE MOVIES

అక్కినేని నాగేశ్వర్ రావు మరియు జయసుధ నటించిన ఆత్మ బంధువులు 


ఈ చిత్రం 1987 లో వచ్చింది. ఈ చిత్రానికి  దాసరి నారాయణ రావు గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వయసు పైబడిన వారి మధ్యన స్నేహాన్ని చక్కగా చూపించారు .  నాగేశ్వర్ రావు మరియు జయసుధ తమ జీవిత భాగస్వాములను కోల్పోయి తమ తమ బిడ్డల వలన బాధలకు గురవ్వుతూ ఉంటారు. ఆ క్రమం లో మనవడు మనవరాలి స్కూల్ వద్ద వారికి స్నేహం ఏర్పడుతుంది. వారి స్నేహం పిల్లలకు నచ్చదు. చివరకు ఎలా వాటిని అధిగమించి తమ స్నేహం తో ఆత్మ బంధువులుగా మారారో ఈ చిత్రం ద్వారా  దర్శకుడు ఎంతో హృద్యంగా చూపించారు . 

ENGLISH VINGLISH - ఇంగ్లీష్ వింగ్లిశ్

MY FAVORITE MOVIES

ENGLISH VINGLISH - ఇంగ్లీష్ వింగ్లిశ్ 


శ్రీదేవి 15 సంవత్సరాల  తరువాత తన నటనా కౌశల్యాన్ని మరో సారి నిరూపించుకున్న చిత్రం "ఇంగ్లీష్ వింగ్లిష్ (ENGLISH VINGLISH)" .  ఈ చిత్రం ద్వారా శ్రీదేవి తమిళ చిత్రాలలో 26 సంవత్సరాల తరువాత,  తెలుగు చిత్రాలలో 18 సంవత్సరాల తరువాత  మరియు హిందీ చిత్రాలలో 15 సంవత్సరాల తరువాత  పునఃప్రవేశం చేసింది .

ఈ చిత్రం  గౌరీ షిండే కి మొదటి చిత్రం. ఈ చిత్ర  కథని తనే రాసి దర్శకత్వం వహించారు గౌరీ షిండే .

ఈ చిత్రంలో శ్రీదేవి పేరు "శశి " .  ఈ చిత్రం యొక్క ఇతివృత్తం ఒక మధ్య తరగతి గృహిణి మనోభావాలకు అద్దం పడుతుంది . శశి ఇంట్లొ లడ్డులు తయారు చేసి సప్లయ్ చేస్తూ తన సొంత వ్యాపారం చూసుకుంటూ ఉంటుంది . కాని తనకు ఇంగ్లీష్ నైపుణ్యం లేకపోవడం వలన భర్త మరియు కుమార్తె తనను గేలి చేయడం శశిలో ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న పట్టుదలకు శ్రీకారం చుడుతుంది .  ఆ క్రమంలో తను అమెరికాలో ఉన్న తన అక్క కుమార్తె వివాహానికి వెళ్ళవలసి రావడం అక్కడ ఇంగ్లీష్ నేర్చుకుని ఎలా తనను తానూ ఎలా నిరుపించుకుందో ఈ చిత్రంలో చాలా అందంగా చూపించారు దర్శకురాలు గౌరి .

ఈ చిత్రంలో  శ్రీదేవి పోషించిన పాత్రని గౌరి  షిండే తల్లి గారి ప్రేరణతో తయారు చేసారు.  గౌరీ షిండే తల్లి పూనే లో ఇంటి వద్ద ఒక ఊరగాయ వ్యాపారం నడిపించేవారు.  తను మరాఠీ మాట్లాడే వారు కాని తనకు ఇంగ్లిష్ వచ్చేది కాదు.  షిండే కి ఈ విషయం చిన్నతంగా ఉండేది . తన ఈ వైఖరిని  ఇతివృత్తంగా చేసుకొని కథ  రాసుకున్నారు అంతే కాక తనే స్వయంగా దర్శకత్వం వహించి తన కథకు అందమైన రూపం చేకూర్చారు గౌరి . ఒక ఇంటర్వ్యూలో, గౌరి  షిండే "నా తల్లికి క్షమాపణ చెప్పటానికే ఈ చిత్రం తయారు చేసాను"' అని చెప్పడం విశేషం .

ఈ చిత్రంలో నాకు నచ్చిన సన్నివేశాలు


  1. తన కుమార్తెతో కలిసి స్కూల్ లో ప్రిన్సిపాల్ ని కలిసే సన్నివేశం. 
  2. ప్లేన్ లో ఎయిర్ హోస్టెస్ తో జరిగే సన్నివేశంలో  శ్రీదేవి హావభావాలు. 
  3. శ్రీదేవి "entrepreneur" అనే పదాన్ని నేర్చుకునే సన్నివేశం 
  4. ముఖ్యంగా చిత్రంలోని క్లైమాక్స్ , శ్రీదేవి స్పీచ్ . 
మీకు కూడా గుర్తుండి పోయిన చిత్రం ఏదన్నా ఉంటే చిన్న వ్యాసం లా రాసి మాకు పంపండి . ఇక్కడ ప్రచురిస్తాము. ఈ ఆర్టికల్ పై మీ కామెంట్స్ కూడా తప్పకుండా రాయగలరు. 
- ఆకృతి 
Related Posts Plugin for WordPress, Blogger...

SMALL BUSINESS IDEAS FOR WOMEN