రాజ బాబు గారి పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. రాజబాబు గారు అక్టోబర్ 20 న రాజమండ్రి లో జన్మించారు. వారి సోదరులు చిట్టిబాబు, అనంత్ ప్రస్తుతం సినిమా మరియు టీవీ ఆర్టిస్టులుగా మనకు తెలుసు. రాజబాబు గారి జీవితం అధ్యాపకునిగా మొదలు పెట్టినప్ప టికి మిమిక్రి మరియు నాటకాల పైన గల ఆసక్తి వారిని మద్రాసుకు వెళ్లి సినిమాలలో నటింపచేసింది. రాజబాబు గారు స్.వీ. రంగారావు మరియు అంజలి దేవి నటించిన తాతా మనవడు చిత్రంలో హీరో పాత్రలో నటించారు. సినిమాలలో తనదైన శైలితో అందరిని నవ్వించటమే కాకుండా ఎందరికో సహాయం చేసేవారు. 78 మందికి వివాహం మరియు 68 మందికి విద్యా దానం చేశారు. తన కష్టకాలంలో సహాయపడిన వారిని మరచి పోకుండా వారికి ఆర్ధికంగా సహాయ పడ్డారు. ఉదాహరణకు ఒకప్పుడు తన ఆకలి తీరటానికి మంచినీళ్లు అందించిన ఒక ప్రముఖ నటి మని ఇంటి వాచిమన్ ని గుర్తుపెట్టుకొని అతనికి ఆర్ధిక సహాయం చేసారు. రాజమండ్రిలో బీదలకు, రిక్షా వాళ్లకు భూమిని కొని దానం చేశారు. కళాశాల కట్టించారు. మంచి నటుడు మాత్రమే కాకుండా మంచి హృదయం గలవాడు కూడా అని పేరు సంపాదించారు. ఇలాంటి నటీ నటులు మానవతను చాటి మనకందరికీ గర్వకారకులైనారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment