billboard

Bhakti

Showing posts with label telugu. Show all posts
Showing posts with label telugu. Show all posts

Tuesday, September 8, 2015

జయ జయ మంగళగౌరీ

జయ జయ మంగళగౌరీ

జయ జయ శంకరీ కౌమారీ (జయ)
నీవే జగతికి కారణమమ్మా
పరదేవతవు నేవేనమ్మా
నీవే మా ఇలవేలుపువమ్మా
దయగొనవమ్మా అమ్మా అమ్మా (జయ)
చల్లని నీ కనుసన్నలలోనా
కొనసాగును మా కోరికలన్నీ
నిలబడవే మా వెన్ను కాపుగా

జయము నొసంగవే సర్వమంగళా (జయ)

Tuesday, September 1, 2015

మంగళగౌరికి శ్రీమతులు ఇవ్వరే

మంగళగౌరికి శ్రీమతులు ఇవ్వరే


మంగళగౌరికి శ్రీమతులు ఇవ్వరే మంగళహారతులు (2)
అయిదు ప్రాణములు అయిదవతనమే (2)
పసుపు కుంకుమ పడతికే సిరులే (మంగళ)
సిగలో పూవులు నగ అంటి కమల కాటుకే కళలంట (2)
చేతికి గాజులు విలువంట నొసటి కుంకుమే బ్రతుకంట
పతినెడబాయని సతులుంటే
పచ్చని తల్లులు పార్వతులే (2)
పతి సన్నిధిలో కన్నుమూసిన ఆరని కుంకుమ హారతులే
ఆరని కుంకుమ హారతులే (మంగళ)
ఇల్ల్లు ఉన్నది గృహలక్ష్మి తల్లి అయినది సంతాన లక్ష్మి
మగని నీడలో మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్యలక్ష్మి (మంగళ)  

Saturday, August 15, 2015

శ్రావణ శుక్రవారపు పాట

శ్రావణ శుక్రవారపు పాట

కైలాసగిరిలోను కల్పవృక్షము క్రింద ప్రమధాదిగణములు కొలువగాను
పార్వతీ పరమేశ్వరులు బాగుగా కూర్చుండ పరమేశ్వరుని అడిగెను పార్వతపుడు
(జయ మంగళం నిత్య శుభమంగళం)
ఏ వ్రతము సంపదలు నెలమి తోడుత నిచ్చు యే వ్రతము
పుత్ర పౌత్రాభివృద్ధి నొసగు అనుచును పార్వతి పరమేశు నడిగెను
(జయ మంగళం నిత్య శుభమంగళం)
కుండిన అనియెడి పట్నంబులో చారుమతి అని ఒక  పడతి గలదు
అత్తమామల సేవ అతి భక్తితో చేసి పతిభక్తి గలిగుండు భాగ్యశాలి
(జయ మంగళం నిత్య శుభమంగళం)
వనిత స్వప్నమందు వరలక్ష్మిచేబోయి చారుమతి లేలెమ్మని చేత చరచెను
చరచినప్పుడు లేచి మీరెవ్వరని నమస్కరించి పల్కెనలినాక్షితో
(జయ మంగళం నిత్య శుభమంగళం)
వరలక్ష్మి నేను వరములు ఇచ్చేను మేల్కొనవే చారుమతి మేలుగాను
కొలచినప్పుడు మెచ్చి కోరిన రాజ్యముల్ వరములానిచ్చేటి వరలక్ష్మి
(జయ మంగళం నిత్య శుభమంగళం)
ఏ విభుని పూజచేయవలెననుచూ చారుమతి యడిగేను శ్రావణముగనూ
యే మాసంబున యే పక్షంబు యే వారమునాడు యే ప్రొద్దున
(జయ మంగళం నిత్య శుభమంగళం)
శ్రావణమాసాన శుక్లపక్షమునందు శుక్రవారమునాడు మునిమాపునా
పంచకల్వలుదెచ్చి బాగుగాను నిల్పి భక్తితో పూజించమని చెప్పెను
(జయ మంగళం నిత్య శుభమంగళం)
చారుమతి లేచి యా శయ్యపై కూర్చుండి బంధువుల పిలిపించి బాగుగానూ
స్వప్నమున శ్రీ మహాలక్ష్మి చకచకవచ్చి కొల్వమని బల్కెను కాంతలారా
ఏ విధమున పూజ సేయవలెనని భందువులడిగిరి ప్రేమతోను
యే యే మాసంబున యే వారమునాడు యే ప్రొద్దునాడు
శ్రావణ మాసాన శుక్ల పక్షమునందు శుక్రవారమునాడు మునిమాపునా
పంచకల్వలు దెచ్చి బాగుగా తను నిల్పి భక్తితో పూజింపుమని జెప్పెను
(జయ మంగళం నిత్య శుభమంగళం)
అపుడు శ్రావణమాసము ముందుగా వచ్చెనని భక్తితో పటమునలంకరించె
వన్నెతోరణాలు సన్నజాజులతో చెన్నుగా నగరు శృంగారించిరి
వరలక్ష్మి నోమనుచు వనితలు అందరూ పసుపుతోడి పట్టుపుటములు గట్టి
పూర్ణంబు కుడుములూ పాయసాన్నములు అవశ్యముగ నైవేద్యము పెట్టుదురు
కండిమండిగలు గడగ నెంచియెండిన కుడుములు ఘన వడలునూ
దండిగా పళ్ళెల ఖర్జూరఫలములూ విధిగ నైవేద్యములు పెడుదురు
నిండు బిందెలలోను నిర్మల వుదకమూ పుండరీకాక్షునకు వారు పోసి
తొమ్మిది పోగుల తోరమొప్పగ పోసి తల్లికి కడు సంభ్రమునను
(జయ మంగళం నిత్య శుభమంగళం)
వేదవిదుడైనట్టి  విప్రుని పిలిపించి గంధమక్షతలిచ్చి కాళ్ళు కడిగి తొమ్మిది పిండి
వంటలతోను రయమొప్పగ బ్రాహ్మణునకు పాయసం బెట్టుదురు
(జయ మంగళం నిత్య శుభమంగళం)

కుంకుమధారణ శ్లోకం

కుంకుమధారణ శ్లోకం

కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం

ధారణేనాస్య శుభదం శాంతిరస్తు సదా మమ. 

Saturday, August 8, 2015

దీపకాంతి నమ్మకాలు

దీపకాంతి నమ్మకాలు

ఇంట్లో వెలిగించే దీపాలు తూర్పు లేక ఉత్తర ముఖంగాను పెట్టినట్టైతే ఇంట్లో లక్ష్మీ దేవి సదా నివసిస్తుంది.
సంధ్యా దీపం మొదలుల్ ఉషోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో అష్టైష్వర్యాలు కలుగుతాయి.
ఇంట్లో దీపకాంతి నాలుగు దిశలా ప్రసరిస్తుంటే ఆ ఇంట్లో సిరి తాండవిస్తుంది.

Friday, August 7, 2015

మంగళ హారతులు - క్షీరబ్ధి కన్యకకు

మంగళ హారతులు 


క్షీరబ్ధి కన్యకకు


క్షీరబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకును నీరజనం  (క్షీ)

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న  కప్పురపు నీరజనం  (క్షీ)

అలివేణి తురమునకు హస్తకమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం  (క్షీ)

చరణ కిసలయములకు సఖియ రంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం  (క్షీ)

అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం (క్షీ)

పగటు శ్రీ వేనకటేశు పట్టపురాణివై
నెగడు సతి కళకును నీరాజనం (క్షీ)

జగతి నలమేలుమంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజశోభనపు నీరాజనం (క్షీ)


Thursday, August 6, 2015

ప్రథమ రజస్వల నమ్మకములు

ప్రథమ రజస్వల నమ్మకములు

సోమ వారము - సామాన్య శాంతి
మంగళ వారమౌ - అధిక శాంతి
బుధ వారము - సామాన్య శాంతి
గురు వారము - మంచిది
శుక్ర వారము - మంచిది
శని వారము - అధిక శాంతి
ఆది వారము - అధిక శాంతి

స్వగౄహమునందు రజస్వల అయినచో చాల మంచిది.

Tuesday, August 4, 2015

ఏడు వారాల నగలు

ఏడు వారాల నగలు



ఆదివారము - కెంపులు - సూర్యుని కోసము
సోమవారము - ముత్యములు - చంద్రుని కోసము
మంగళవారము - పగడాలు - కుజుని కోసము
బుధవారము - పచ్చలు - బుధుని కోసము
గురువారము - పుష్యరాగము - బృహస్పతి కోసము
శుక్రవారము - వజ్రాలు - శుక్రుని కోసము
శనివారము - నీలమణి, మణి హారాలు - శనిదేవుని కోసము


Wednesday, February 18, 2015

Related Posts Plugin for WordPress, Blogger...

SMALL BUSINESS IDEAS FOR WOMEN