అలనాటి హాస్యానటి గిరిజ
అలనాటి హాస్యానటి గిరిజ గారు మార్చి నెల 3 వ తేదీన , 1938 సంవత్సరంలో కంకిపాడు అనే గ్రామంలో జన్మించారు. గిరిజ మొదటి చిత్రం "పరమానందయ్య శిష్యులు ". ఈ చిత్రంలో నాగేశ్వరరావు గారితో హీరోయిన్ గా నటించారు. అలాగే పాతాల భైరవి చిత్రంలో పాతాల భైరవి పాత్రను పోషించారు. ఈ చిత్రంలో రేలంగి గారు ""జై పాతాల భైరవి" అనగానే "నరుడా ఏమి నీ కోరిక"' అంటూ ప్రత్యక్షం అయ్యే సన్నివేశం హాస్య భరితంగా ఉంటుంది .
తరువాతి కాలంలో హాస్యనటి గా పేరొందిన గిరిజ పేరు వినగానే మనకు "సరదా సరదా సిగరెట్టు " అని రేలంగి గారితో పాటు పాడుతూ అడే అందమైన అమ్మాయి గుర్తుకు వస్తుంది .
లేదా రేలంగి గారు సన్యాసి వేశం లో "కాశికి పోయాను రామాహరి అని చెబుతుంటే కాశికి పోలేదు రామాహరి"' అని అతన్ని తిప్పలు పెట్టే పాట గుర్తుకు వస్తుంది . ఇలాగే సరదాగా సాగే ఇంకో పాట ""ఇంగ్లీష్ లోన మ్యారీజి, హిందీలో అర్ధము షాది ". గిరిజా రేలంగి గార్లది అప్పటి సినిమాల్లో హిట్ పెయిర్ .
లవకుశ లో ను రాముల వారు సీతమ్మను మరల అడవికి పంపవలసి రావడానికి కారణమైన సన్నివేశంలోనూ వీరిద్దరూ కలిసి నటించారు.
No comments:
Post a Comment