MY FAVORITE MOVIES
Mitr, My Friend
మిత్ర్ మై ఫ్రెండ్ (Mitr, My Friend) చిత్రం 2002 లో విడుదలైంది . ఈ చిత్రానికి ప్రముఖ నటి రేవతి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారా రేవతి నటనలో మాత్రమే కాక దర్శకత్వం లోను తన ప్రతిభను కనబరచారు . ఇంకో గమనించ దగ్గ విషయం ఏమిటంటే ఈ చిత్రానికి సహకరించిన సిబ్బంది అంతా మహిళాలే.
ఈ చిత్రంలోని ముఖ్య పాత్రని శోభన నటించి తన నటనతో మరోసారి అందరిని మెప్పించగలిగారు . ఒక చిన్న పట్టణం లోంచి భర్తతో పాటు అమెరికా వచ్చిన అమ్మాయి జీవితంలో జరిగే పరిణామాలు ఈ చిత్రంలో చూపించారు .
లక్ష్మి (శోభన) చిదంబరంకు చెందినా అమ్మాయి తనకి పృథ్వీ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పెళ్లి జరుగుతుంది . పెళ్లి తరువాత ఆ జంట అమెరికా వచ్చి స్థిరపడతారు. కొంత కాలానికి వారికి ఒక పాప పుడుతుంది . ఆ పాపకు దివ్య అని నామకరణం చేస్తారు . అలా 17 సంవత్సరాల తరువాత దివ్య పేరిగి పెద్దదై కళాశాల కు వెళ్తుంది . భర్త కూడా వ్యాపారం లో బిజీ గా ఉంటూ లక్ష్మితో ఎక్కువ సమయం గడపలేక పొతాడు . అలా వారిద్దరి మద్య దూరం పెరుగుతూ ఉంటుంది . లక్ష్మి వంటరితనముతో బాధ పడుతూ కాలం వెళ్ళదీస్తూ ఉంటుంది .
యుక్తవయసుకు వచ్చిన దివ్య కి ఫ్రెండ్స్, పార్టీలు మొదలవుతాయి. దివ్య వైఖరిలో వచ్చిన మార్పులను గమనిస్తున్న లక్ష్మికి దివ్య చెడు స్నేహాలు నచ్చావు తనని వారించడంతో దానితో ఇద్దరి మధ్య సమస్యలు తలెత్తుతాయి . ప్రిథ్వి మాత్రం వీటన్నింటిని గమనించినా కూడా ఎక్కువగా పట్టించుకోకుండా కూతురుకి మద్దతుగా ఉంటాడు .
ఒక రోజు దివ్య ఇంటి బయట తన బాయ్ ఫ్రెండ్ తో సన్నిహితంగా ఉండటం చూసిన లక్ష్మి జోస్యం చేసుకోవడంతో అలిగిన దివ్య, ఇంట్లోంచి వెళ్ళిపోయి స్నేహితుల దగ్గర ఉండటం మొదలు పెడుతుంది .
వంటరితనం మరింత పెరిగిన లక్ష్మి కి ఇంటర్నెట్లో ఒక స్నేహితుడు పరిచయమవుతాడు . ఇద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా, మారు పేర్లతో ముచ్చటించుకోవటం మొదలు పెడతారు. క్రమంగా లక్ష్మి అతనితో తన ఆలోచనలు, భావాలు పంచుకోవటం మొదలు పెదుతుంది . అతని ప్రోత్సాహం వళ్ళ లక్ష్మి తన ఆసక్తులు అన్వేషించి వాటి వైపు మనసు మళ్ళించి కాలం గడపటం మొదలు పెడుతుంది .
ఇంతలో ప్రిథ్వి దివ్యను మిస్ అవటం మరియు లక్ష్మిలో మార్పు గమనిస్తాడు. ఒకరోజు దివ్య కి బాయ్ ఫ్రెండ్ వలన దెబ్బలు తగిలాయని తెలిసిన లక్ష్మి దివ్య ని కలుస్తుంది. దివ్య కూడా తన తప్పు తెలుసుకొని తల్లి వెంట ఇంటికి తిరిగి వస్తుంది . లక్ష్మి దివ్యాల మధ్య తలెత్తిన మనసపర్థాలు తొలగుతాయి .
ఇంతలో దివ్యకి తన తల్లి ఇంటర్నెట్ ఫ్రెండ్ "'మిత్ర్ " గురించి తెలిసి అతనిని కలవమని తల్లిని ప్రొత్సాహిస్తుంది . లక్ష్మి, మరియు దివ్య "మిత్ర్ " ని కలవవలసిన స్థలంకి వెళ్లేసరికి కథ ఊహించని మలుపు తిరుగుతుంది . ఇంతకాలం తనతో స్నేహం చేసిన ఇంటర్నెట్ మిత్రుడు వేరెవరో కాదు తన భర్త అని తెలిసిన లక్ష్మి షాక్ అవుతుంది . అలాగే ప్రిథ్వి కూడా లక్ష్మిని చూసి ఆశ్చర్యపొతాడు. తను లక్ష్మిని నిర్లక్ష్యం చేయటం వలనే తను తన మనోభావాలను ఇతరులతో పంచుకోవలసి వచ్చిందని తెలిసి ఏంటో బాధపడి తన తప్పు తెలుసుకోవడంతో చిత్రం ముగుస్తుంది .
- ఈ చిత్రం ద్వారా రేవతి అమెరికాలో ఇంట్లోనే ఉండె ఒక గృహిణి ఎలా కాలం వేళ్ళదీస్తుందో శోభన దినచర్యలో చక్కగా చూపించారు .
- ఇంకా చెప్పుకోదగిన విషయాలు ఈ చిత్రంలో ఏమిటంటే బయట దేశంలో పెరుగుతూ అక్కడి సంస్కృతికి, మరియు చెడు స్నేహాల వలన తప్పు దారి పడుతున్న కూతురిని చూస్తూ ఒక తల్లి పడే బాధ. అలాగే భర్త తనకి తగిన సమయం కేటాయించకుండా ఉన్నప్పుడు ఆ భార్య మనో వేదన, ఒంటరి తనం ఈ చిత్రం లో రేవతి చక్కగా చూపించారు .
- ఆకృతి
No comments:
Post a Comment