MY FAVORITE MOVIES
అక్కినేని నాగేశ్వర్ రావు మరియు జయసుధ నటించిన ఆత్మ బంధువులు
ఈ చిత్రం 1987 లో వచ్చింది. ఈ చిత్రానికి దాసరి నారాయణ రావు గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వయసు పైబడిన వారి మధ్యన స్నేహాన్ని చక్కగా చూపించారు . నాగేశ్వర్ రావు మరియు జయసుధ తమ జీవిత భాగస్వాములను కోల్పోయి తమ తమ బిడ్డల వలన బాధలకు గురవ్వుతూ ఉంటారు. ఆ క్రమం లో మనవడు మనవరాలి స్కూల్ వద్ద వారికి స్నేహం ఏర్పడుతుంది. వారి స్నేహం పిల్లలకు నచ్చదు. చివరకు ఎలా వాటిని అధిగమించి తమ స్నేహం తో ఆత్మ బంధువులుగా మారారో ఈ చిత్రం ద్వారా దర్శకుడు ఎంతో హృద్యంగా చూపించారు .
No comments:
Post a Comment